మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్‌

విజయనగరం జిల్లా రామతీర్థం పర్యటనకు వెళ్లినవైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై దాడి ఘటనలో కళా వెంకట్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Update: 2021-01-20 16:04 GMT

ఏపీ తెలుగుదేశం పార్టీ  సీనియర్‌ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావును పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. విజయనగరం జిల్లా రామతీర్థం పర్యటనకు వెళ్లినవైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై దాడి ఘటనలో కళా వెంకట్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా రాజాంలోని తన నివాసంలో రాత్రి 9 గంటల సమయంలో నెల్లిమర్ల పోలీసులు కళాను అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.

విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో రాముడి విగ్రహాం ధ్వంసం ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఈ నెల 2వ తేదీన చంద్రబాబునాయుడు, విజయసాయిరెడ్డిలు వేర్వేరుగా వెళ్లారు.తొలుత విజయసాయిరెడ్డి ఆలయం వద్ద సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లే సమయంలో ఆయన కారుపై దాడి జరిగింది. ఈ ఘటనపై  ఈ నెల 3వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావుల డైరెక్షన్ లోనే తనపై దాడి జరిగిందని విజయసాయిరెడ్డి  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News