Andhra Pradesh: సచివాలయంలో కరోనాతో మరో ఉద్యోగి మృతి
Andhra Pradesh: సచివాలయంలో కరోనాతో మరో ఉద్యోగి మృతి * కరోనాతో ఇవాళ ఉదయం మృతి చెందిన శాంతకుమారి
ఆంధ్రప్రదేశ్ సచివాలయం (ఫైల్ ఇమేజ్)
Andhra Pradesh: ఏపీ సెక్రటేరియట్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. సచివాలయంలో కరోనాతో మరో ఉద్యోగి మృతి చెందింది. కరోనాతో ఇవాళ ఉదయం పంచాయతీరాజ్‌శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శాంతకుమారి మృతి చెందారు. రెండు రోజుల క్రితం శాంతకుమారి భర్త కూడా కరోనాతో కన్నుమూశారు. శాంతకుమారి భర్త కూడా ఏపీ సెక్రటేరియట్‌లో పనిచేస్తున్నారు. గత మూడు రోజుల్లో కరోనాతో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. కరోనా భయాందోళనతో వర్క్‌ఫ్రమ్ హోంకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నారు సచివాలయ ఉద్యోగులు.