AP Panchayat Elections: మూడోవిడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం
* 13 జిల్లాల్లో 19 రెవెన్యూ డివిజన్లలో.. నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం * ఫిబ్రవరి 17న పోలింగ్, అదేరోజు ఫలితాలు
ఏపీ పంచాయతీ ఎన్నికలు ప్రతీకాత్మక చిత్రం (ఫోటో:హాన్స్ ఇండియా)
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడతలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పుడు.. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇవాళ్టితో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఫిబ్రవరి 17న 13 జిల్లాల్లోని 19 రెవెన్యూ డివిజన్లలో 3 వేల 249 పంచాయతీలు, 32 వేల 502 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక.. అదేరోజు సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి.