AP Municipal Elections: ఆ మున్సిపాలిటీలో జనసేన-వైసీపీ హోరాహోరీ

AP Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికారపార్టీ దూసుకెళ్తుంది. అయితే గోదావరి జిల్లాలో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

Update: 2021-03-14 07:12 GMT

పవన్ కళ్యాణ్, జగన్ 

AP Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికారపార్టీ దూసుకెళ్తుంది. అయితే గోదావరి జిల్లాలో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు జనసేన పార్టీ కూడా ఫలితాల్లో సత్తాచాటుతోంది. మెజారిటీ స్థానాల్లో వైసీపీ అధిక్యం కొనసాగిస్తుండగా తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన అమలాపురంలో జనసేన అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. అమలాపురంలో 5 వార్డులను జనసేన కైవసం చేసుకుంది. అమలాపురం మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా.. అందులో 6 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కొన్నిచోట్ల టీడీపీ తీవ్రపోటీ ఇస్తోంది. ఒక విధంగా వైసీపీ కంటే ముందంజలోనే ఉంది. దీంతో 24 వార్డులకే ఎన్నికలు నిర్వహించారు. పట్టణంలోని 3,4,6,7 వార్డుల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. మరో వార్డు కూడా జనసేన ఖాతాలో చేరింది. ప.గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలోని 4వ వార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించారు.

జనసేనకు గోదావరి జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీల్లో మెరుగైన స్థానాలు వచ్చే అవకాశమున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అటు వైసీపీ నాలుగు స్థానాలు గెలుచుకోగా.. టీడీపీ రెండుచోట్ల విజయం సాధించింది.మరోవైపు గుంటూరు జిల్లాలలో కూడా వైసీపీ అభ్యర్థులు విజయం దిశగా సాగుతున్నారు. గుంటూరు సిటీ 7 వ డివిజన్ వైసీపీ గెలుపొందింది. గుంటురు జిల్లాలో తెనాలి, చిలకలూరి పేటలో కూడా వైసీపీ విజయం సాధించింది. ఇక సత్తనపల్లి, రేపల్లిలో కూడా వైసీపీ హావా కొనసాగుతుంది.ఇప్పటికే 30 శాతం మున్సిపాలిటీల్లో వైసీపీ జెండా ఎగిరింది. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ చూస్తుంటే కచ్చితంగా హాఫ్ సెంచరీ కొట్టే దిశగా దూసుకుపోతోంది. డోన్ లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఓవారాల్ గా చూస్తే 25కు పైగా మున్సిపాలిటీలను వైసీపీ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం అధికార్టీ 75 స్థానాల్లో 53 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ ఇంకా ఖాతా తెరవలేదు.

Tags:    

Similar News