Pawan Kalyan: పవన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసిన మంత్రులు

Pawan Kalyan: తాజాగా జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి.

Update: 2021-09-26 08:32 GMT

pawn కళ్యాణ్ వ్యాక్యలపై స్పందించిన మంత్రి అనిల్ (ఫైల్ ఇమేజ్)

Pawan Kalyan: ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన మధ్య సాగుతున్న పోరులో తాజాగా జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం తనను టార్గెట్ చేసేందుకే ఆన్ లైన్ సినిమా టికెట్లను తీసుకొస్తోందంటూ పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై మంత్రులు విరుచుకుపడుతున్నారు. పవన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేశారు.

పవన్ కల్యాణ్ విమర్శలపై మంత్రి అనిల్ ధీటుగా బదులిచ్చారు. పవన్ నటించినా.. సంపూర్ణేష్ బాబు నటించినా.. కష్టం అనేది ఇద్దరిదీ ఒకటేనన్నారు. ఆన్లైన్ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దలతో చర్చించారన్నారు. ఆన్‌లైన్‌ పోర్టల్ అంటే పవన్‌కు ఎందుకంత భయం అని.. దాని వల్ల ఆయనకు వచ్చిన నష్టమేమిటని ప్రశ్నించారు మంత్రి అనిల్. సినిమా ఖర్చులో కేవలం నలుగురైదుగురికి మాత్రమే లబ్ధి ఎక్కువగా ఉంటుందని ఇది ఎంత వరకు సబబన్నారు.

వైసీపీ మంత్రులు సన్నాసులైతే పవన్ కల్యాణ్ రుషి పుంగవుడా అంటూ ఎద్దేవా చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. నోరు ఉంది కదా అని పవన్ ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఉరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. సినిమా టికెట్ల ధరలు ఇష్టానుసారంగా పెంచి, ప్రజల పై భారం వేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, సినిమా టికెట్ల విషయంలో నియంత్రణ లేకుండా పోతోందన్నారు ఆయన. సినిమా టికెట్ల ఆన్ లైన్ అమ్మకాల విధానాన్ని సినిమా డిస్ట్రిబ్యూటర్లే అడిగారని, వాళ్ళకి లేని బాధ పవన్ కళ్యాణ్ కి ఎందుకు అంటూ ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీ లో ఏమైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, పరిశ్రమలో పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు కదా...చిరంజీవి, మోహన్ బాబులాంటి పెద్దలు ప్రభుత్వంతో సంప్రదించవచ్చు అని తెలిపారు

Tags:    

Similar News