Roja: పవన్ వాహనం వారాహి కాదు అది నారాహి
Roja: రకారకాల విన్యాసాలు, పిచ్చి ట్వీట్ల చేస్తున్నారు పవన్
Roja: పవన్ వాహనం వారాహి కాదు అది నారాహి
Roja: జనసేన, వైసీపీ పార్టీ మధ్య జరుగుతున్న ట్వీట్ వార్‌పై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. జనసేనాని పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. పవన్ వాహనం వారాహి కాదు నారాహి అని కామెంట్ చేశారు. 175 స్థానాలు గెలవాలనుకుంటున్న వైసీసీ... 175 మంది అభ్యర్థులు కూడా లేని జనసేనని చూసి ఎందుకు భయపడుతుందని అన్నారు. హైదరాబాద్‌లో బతికే పవన్ శ్వాస తీసుకోవాలా వద్దా అని అడగాల్సింది... వైసీపీని కాదు కేసీఆర్, కేటీఆర్‌లని అని పేర్కొన్నారు. పవన్ రకరకాల విన్యాసాలు చేస్తూ... పిచ్చి ట్వీట్లతో యుద్దానికి సిద్ధం అంటున్నారని... వైసీపీ కూడా యుద్దానికి రెడీగా ఉందని రోజా స్పష్టం చేశారు.