Ongole RIMSలో నేలపై కరోనా పేషంట్లు..‌‌స్పందించిన మంత్రి ఆళ్లనాని

Ongole RIMS: కరోనా పేషంట్ల ఇబ్బందులపై HMTV ప్రసారం చేసిన ప్రత్యేక కథనానికి మంత్రి ఆళ్లనాని స్పందించారు.

Update: 2021-04-25 11:49 GMT

నాని ఫైల్ పోటో

Ongole RIMS: ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ లో కరోనా పేషంట్ల ఇబ్బందులపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనంపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని స్పందించారు. ఆసుపత్రి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ బాధితుల కోసం 1600 బెడ్స్ సిద్ధం చేశామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఒంగోలు రిమ్స్ తో పాటు 14 ఏరియా హాస్పిటల్స్ కోవిడ్ బాధితులకు వైద్య సదుపాయం కల్పించామని వివరించారు. అదే విధం మరో 42 ప్రైవేట్ హాస్పిటల్స్ ను కోవిడ్ బాధితుల కోసం తీసుకుంటున్నట్లు చెప్పారు. పేషంట్లకు అవసరమైన ఆక్సిజన్, రెండు వేల 800 రెమిడేసివర్ ఇంజక్షన్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ఒంగోలులో కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో రిమ్స్ సమీపంలో ప్రైవేట్ స్కూల్ లో బాధితులకు వైద్య సహాయం అందించే విధంగా చర్యలు తీసుకున్నట్లు మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ప్రతి రోజు కోవిడ్, నాన్ కోవిడ్ బాధితులకు 12 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటుందని మంత్రి తెలిపారు. రిమ్స్ లో 1126 బెడ్స్ ఉన్నాయని.. వీటిలో 950 మంది కోవిడ్, మరో 150 మంది నాన్ కోవిడ్ పేషంట్స్ చికిత్స పొందుతున్నారని అధికారులు మంత్రి ఆళ్లనాని దృష్టికి తీసుకు వెళ్లారు.

Tags:    

Similar News