Kodali Nani: పవన్ కళ్యాణ్.. జగన్ చిటికెనవేలుతో సమానం
* జగన్‌ను భయపెట్టే మగాడు భూమిపై లేడు - కొడాలి * పవన్‌కు జీవిత కాలం టైమ్ ఇస్తున్నా.. దమ్ముంటే జగన్‌ను టచ్ చేసి చూడాలి
పవన్ - కొడాలి నాని (ఫైల్ ఫోటో)
Minister Kodali Nani: చిత్ర పరిశ్రమపై పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి కొడాలి నాని. నలుగురు హీరోలు, నలుగురు నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని పని చేయమని, అందరినీ దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు మంత్రి. జగన్‌ను భయపెట్టే మగాడు భూమిపై లేడని, పవన్.. జగన్ చిటికెనవేలుతో సమానమన్నారు. పవన్ బెదిరింపులకు ఎవరూ భయపడరన్నారు. పవన్‌కు జీవిత కాలం టైమ్ ఇస్తున్నా దమ్ముంటే జగన్‌ను టచ్ చేసి చూడాలని సవాల్ విసిరారు.
అంతకు ముందు రామానాయుడు స్టూడియోలో ఆటో రజిని చిత్రం ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. కెమెరా స్విచ్‌ను మంత్రి కొడాలి నాని ఆన్ చేయగా ఎంపీ నందిగామ సురేష్ క్లాప్ కొట్టారు. ఈ సినిమాలో హీరోగా జొన్నలగడ్డ హరి నటిస్తుండగా జొన్నలగడ్డ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.