వాయిదా తర్వాత ప్రారంభమైన శాసనమండలి సమావేశాలు

-మండలి ముందుకు అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు - ఛైర్మన్ అనుమతితో బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం

Update: 2020-01-21 13:37 GMT
Ap legislative council

ఐదు సార్లు వాయిదా పడ్డ శాసనమండలి సమావేశాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. మండలి ఛైర్మన్ అనుమతితో ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్ధిక మంత్రి బుగ్గన, సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స శాసనమండలిలో ప్రవేశపెట్టారు.

మండలి ప్రారంభం నుంచే ఇవాళ సభలో రూల్‌ 71 పై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బిల్లులను ప్రవేశపెట్టేందుకు టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మండలిలో వాయిదాల పర్వం కొనసాగింది. మండలి ఛైర్మన్‌ను టీడీపీ సభ్యులు ప్రభావితం చేస్తున్నారని.. వైసీపీ సభ్యులు, మంత్రులు ఆరోపించారు. మరోవైపు, మండలిలో రూల్ 71పై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. రూల్ 71పై చర్చకు పట్టుబడుతూ.. విపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో మండలిలో గందరగోళం కొనసాగింది. దీంతో ఛైర్మన్ సభను పలుమార్లు వాయిదా వేశారు.

చివరకు మంత్రులు మండలి ఛైర్మన్‌తో భేటీ కావడంతో.. బిల్లులను ప్రవేశపెట్టేందుకు అనమతించారు. దీంతో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే రూల్‌ 71 కింద నోటీసులిస్తే.. బిల్లులను ప్రవేశపెట్టేందుకు ఎలా అనుమతిస్తారని.. టీడీపీ సభ్యులు ఆరోపిస్తూ.. మండలిలో ఆందోళన చేపట్టారు.  

Tags:    

Similar News