పోలవరం సందర్శనకు కేంద్ర జలశక్తి మంత్రి : అనిల్ కుమార్ యాదవ్

Update: 2019-12-11 00:58 GMT

కేంద్ర జలశక్తి మంత్రి గంజంద్ర సింగ్ షెకావత్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వైసీపీ ఎంపీలు కలిశారు. ఈ సందర్బంగా పోలవరం నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టులో అతిముఖ్యమైన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజిని త్వరగా తేల్చాలని షెకావత్ దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. సమావేశం అనంతరం మంత్రి అనిల్ మాట్లాడారు.. రాష్ట్రానికి రావలసిందిగా కేంద్రమంత్రి షెకావత్‌ను ఆహ్వానించామని, పార్లమెంట్ సమావేశాల అనంతరం ఆయన పోలవరం సందర్శనకు వస్తారని మంత్రి అనిల్ తెలిపారు.

త్వరలో కేంద్రం రూ.1850 కోట్లు విడుదల చేస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. 2021 చివరి నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. అయితే టీడీపీ చెబుతున్నట్టు పోలవరం 65 శాతం పూర్తి కాలేదని.. ఇప్పటివరకు 35 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని స్పష్టం చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌ ద్వారా రూ.800 కోట్లు ఆదా చేసిన విషయాన్ని కేంద్రమంత్రికి వివరించామని.. ఇది విని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి అనిల్ వెల్లడించారు. 

Tags:    

Similar News