చంద్రబాబుకు షాక్.. సొంత ఊర్లో వైసీపీ హవా

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు పెద్ద షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సొంత ఊర్లోనే ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2020-03-15 02:13 GMT
chandra babu File Photo

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు పెద్ద షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు సొంత గ్రామం ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో అధికార వైసీపీ దాదాపు 80శాతం స్థానాలు ఏకగ్రీవం అయినట్లు చేసుకుంది. 95 ఎంపీటీసీల్లో ఇప్పటి వరకు 76 స్థానాలు ఏకగ్రీవమైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఎన్నికలు ఏకగ్రీవం చేసేందుకు వైసీపీ మిగతా అభ్యర్థులతో చర్చలు జరుపుతుంది. దీంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోగా మిగిలిన 19 స్థానాల్లో ఎంత మంది బరిలో ఉంటారనేది ప్రశ్నార్థకమే.

చంద్రబాబు సొంత గ్రామం నారావారి పల్లె చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉంది. చంద్రబాబు గతంలో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత ఆయన కుప్పం నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. చంద్రబాబు సొంత గ్రామం చంద్రగిరి సైతం ఆయనకు కీలకమే. అయితే 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నుంచి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి గెలుపొందారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి ఇక్కడ గెలుపొందారు.

తెలుగుదేశం స్థానిక ఎన్నికల్లో పోటీ లేకపోవడంతో చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. ఎంపీటీసీ ఏకగ్రీవాలై వైసీపీ ఖాతాలో జమ అయ్యాయి. చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లెలో వైసీపీకి పోటీ లేకుండా, ఎన్నికలకు వెళ‌్లకుండా ఏకగ్రీవమైనట్లు వైసీపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఎంతవరకు వాస్తవమన్నది అధికారికంగా వెల్లడించే వరకు వేచి చూడాలి.

 


Tags:    

Similar News