గవర్నర్‌తో మండలి చైర్మన్ షరీఫ్‌ కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌, గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశం అయ్యారు.

Update: 2020-02-18 14:47 GMT
బిశ్వభూషణ్ హరిచందన్‌, షరీఫ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌, గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశం అయ్యారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు చేరుకున్న షరీఫ్.. గవర్నర్‌తో కీలక అంశాలపై చర్చించారు. మండలిలో జరిగిన పరిణామాలపై గవర్నర్ కు వివరించారు. పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించే విషయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

మండలి చైర్మన్ షరీఫ్ గవర్నర్‌ను కలిసిన అనంతరం మాట్లాడుతూ.. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుపై రెండు సార్లు ఆదేశించామని, కానీ మండలి కార్యదర్శి సంబంధిత ఫైలును తిప్పి పంపించారని చెప్పారు. చైర్మన్ ఆదేశించినాలు కార్యదర్శి రూలింగ్ చేయకుండా జాప్యం చేస్తున్నారని తెలిపారు. చైర్మన్ ఆదేశాలను ధిక్కరించిన మండలి కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. సెలెక్ట్ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు.

   

Tags:    

Similar News