AP Inter Exams 2020: నేడే ఇంటర్ ఫలితాలు

Update: 2020-06-12 02:23 GMT

కరోనా పుణ్యమాని వాయిదా పడుతూ వస్తున్న ఇంటర్ ఫలితాలు నేడు వెల్లడించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏటా వీటిని ఇప్పటికే వెల్లడించడం, ఎంసెట్ ఇతర పరీక్షలకు రాసే అవకాశం ఉండేది. కానీ ఈ ఏడాది కరోనా మహమ్మారి వల్ల వాటన్నింటిలోనూ మార్పలు వచ్చాయి. అయితే ఇప్పటికైనా ఫలితాలు వెల్లడిస్తే భవిషత్తు కార్యాచరణ చేసుకునేందుకు విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఏపీలో నేడు (శుక్రవారం) ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ల పరీక్షల ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ ఫలితాలను నేడు మధ్యాహ్నం 12. 30 తర్వాత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించనున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆలస్యమైన జవాబు పత్రాల మూల్యాంకనం ఇంటర్ బోర్డు అధికారులు ఎట్టకేలకు పూర్తి చేశారు. దీనితో నేడు ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేయనుంది. మార్చి 4 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఎగ్జామ్స్ జరిగిన సంగతి విదితమే. కాగా, ఏపీలో పదో తరగతి పరీక్షలు జులై 10 నుంచి 15వ తేదీ వరకూ జరగనున్నాయి.

Tags:    

Similar News