ఏపీ హోం మంత్రి అనిత నివాసంలో సంక్రాంతి సంబరాలు

ఏపీ హోం మంత్రి అనిత నివాసంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.

Update: 2026-01-14 08:00 GMT

ఏపీ హోం మంత్రి అనిత నివాసంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కేరళ డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో హోం మంత్రి అనిత కేరళ కళాకారులతో కలిసి డ్రమ్స్ వాయిస్తూ సందడి చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలంతా సంక్రాంతి పండుగను ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండుగలు అందరినీ కలిపే వేళలని, ఇలాంటి సందర్భాల్లో సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆమె తెలిపారు.

Tags:    

Similar News