ఏపీ డీజీపీపై హైకోర్టు ఆగ్రహం

Update: 2020-03-12 11:23 GMT
dgp gautam sawang file photo

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై సీరియస్ అయ్యిన కోర్టు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించింది. దాడి వ్యవహారంలో పోలీసులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని అడిగింది. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ అమలతో పాటు 500 మంది పోలీసులు లాంగ్ మార్చ్ చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలేంటని ప్రశ్నించింది.

ఈ సందర్భంగా డీజీపీ స్పందిస్తూ.. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటం వల్లనే చర్యలు తీసుకోలేదని అన్నారు. కోర్టు ఆదేశిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని డీజీపీ పేర్కొన్నారు. విశాఖలో కొన్ని పరిస్థితుల ప్రభావం వలన అలాంటి చర్యలు తీసుకున్నామని డీజీపీ తెలిపారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన సీజే.. మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోతే తామే తీసుకుంటామని స్పష్టం చేశారు. మీ కింద అధికారులు చట్టాన్ని అతిక్రమిస్తే దాన్ని సమర్ధిస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సీజే విశాఖలో ఏ అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను సీజే వాయిదా వేశారు. 

Tags:    

Similar News