AP High Court: ప్రభుత్వానికి ధరల నిర్ణయాధికారం లేదన్న హైకోర్టు

AP High Court: జాయింట్ కలెక్టర్ దే తుది నిర్ణయం

Update: 2022-04-22 01:37 GMT

AP High Court: ప్రభుత్వానికి ధరల నిర్ణయాధికారం లేదన్న హైకోర్టు

AP High Court: ఏపీలో సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం నిర్ణయించేందుకు వీల్లేదంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశమైంది. పాత విధానంలో అమ్మకాలు చేసుకోవచ్చంటూ కోర్టు స్పష్టం చేసింది. సినిమా టికెట్ల రేట్లను, సర్వీస్‌ ఛార్జీలను నిర్ణయించే అధికారం లైసెన్సింగ్‌ అథార్టీ అయిన జాయింట్‌ కలెక్టర్‌కు మాత్రమే ఉంటుందని హైకోర్టు తెలిపింది. మళ్లీ పాత విధానంలో ఆన్‌లైన్‌ టికెట్లు అమ్ముకోవచ్చని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా టిక్కెట్లను కొనేవారిపై సర్వీస్‌ ఛార్జీల భారం వేయవచ్చంటూ, హైకోర్టు జస్టిస్‌ సోమయాజులు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

ఇక ఏపీ ప్రభుత్వం ఇచ్చిన కొత్త జీవోలో రకరకాల ఆంక్షలు పెట్టింది. పెద్ద సినిమాలకు పెద్ద రేట్ చిన్న సినిమాలకు ఇంకో రేటు ఏపీలో షూటింగ్ జరుపుకునే సినిమాలకు ఓ రూల్ అంటూ అనేక అంశాలతో జీవో ఇచ్చారు. తాజాగా ఈ జీవో ప్రకారమే టిక్కెట్ రేట్లను ఖరారు చేస్తున్నారు. అయితే ఇప్పుడు హైకోర్టు అవేమీ పని చేయవని జేసీ నేతృత్వంలో ఉండే లైసెన్సింగ్ అథారిటీనే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. కానీ ప్రభుత్వాన్ని కాదని కోర్ట్ చెప్పిన ప్రకారం చేయలేరు. ఎప్పటిలానే కోర్టు తీర్పును అమలు చేస్తున్నామని చెప్పి, జగన్ సర్కారు ఇచ్చిన జీవో ప్రకారమే అమ్మకాలు సాగించే అవకాశముంది. ఆచార్య సినిమా విడుదలకు సిద్దమవుతోన్న తరుణంలో, మరలా టికెట్ అమ్మాకాలపై కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేయటంతో ఇంట్రెస్టింగ్ అంశం గా మారింది.

Tags:    

Similar News