Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
Andhra Pradesh: విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకానికి హైకోర్టు బ్రేక్ వేసింది.
Ap High Court: (File Image)
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకానికి హైకోర్టు బ్రేక్ వేసింది. మొత్తం ఐదు చోట్ల భూముల అమ్మకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా.. దానిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.
గతంలో బిల్డ్ ఏపీ పేరిట అమ్మకాలకు ప్రయత్నించగా.. కోర్టు స్టే ఇచ్చిందని పిటిషనర్ తెలిపారు. దీంతో ఇవే ఆదేశాలు విశాఖ భూముల అమ్మకానికి కూడా వర్తిస్తాయన్న ధర్మాసనం.. టెండర్లు ఫైనలైజ్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.