కరకట్ట భవన యజమానులకు మరోసారి హైకోర్టు నోటీసులు

Update: 2019-11-02 01:05 GMT

కష్ణానది ఒడ్డున అక్రమంగా నిర్మించిన భవనాలపై వివరణ ఇవ్వాలని యజమానులను ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇందులో భాగంగా వారికి మరోసారి నోటీసులు ఇస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలనీ పేర్కొంది. ఇప్పటికే హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్న యజమానులు, ప్రభుత్వాధికారులు తదుపరి విచారణలోపు కౌంటర్ దాఖలు చేయాలనీ ఆదేశించింది. అనంతరం విచారణను ఆరు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా కష్ణానది కరకట్ట మీద.. తాడేపల్లి మండలం, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని వివిధ సర్వే నెంబర్లలో కొందరు వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేపట్టారని, దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకష్ణారెడ్డి 2017లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఇందులో లింగమనేని రమేశ్, ఇతర నిర్మాణాల యజమానులు, పలువురు

ప్రభుత్వ అధికారులతో సహా 49 మంది ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. నోటీసులు అందని వారికి మరోసారి నోటీసులు ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది హైకోర్టు. ఈ క్రమంలో ఈ అక్రమ నిర్మాణాలకు మరోసారి నోటీసులు అందనున్నాయి. మరోవైపు ఇప్పటికే రెండుసార్లు ప్రభుత్వం వీరికి నోటీసులు ఇచ్చింది. ఇందులో లింగమనేని రమేష్ ఇల్లు కూడా ఉండటం విశేషం.  

Tags:    

Similar News