పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట: ముందస్తు బెయిల్ మంజూరు

Perni Nani: పేర్ని నానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Update: 2025-03-07 05:39 GMT

పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట: ముందస్తు బెయిల్ మంజూరు

Perni Nani: పేర్ని నానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని పేరును ఏ 6గా పోలీసులు చేర్చారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పేర్నినాని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన ఏపీ హైకోర్టు పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్య జయసుధ పేరు ఏ1 గా చేర్చారు పోలీసులు. ఇదే కేసులో పేర్ని నాని పేరును 2024 డిసెంబర్ 31న ఏ 6గా చేర్చారు. ఏ1 గా ఉన్న పేర్ని జయసుధకు కోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరో వైపు ఈ కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

పేర్ని జయసుధ పేరున ఉన్న గోడౌన్ లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం మాయమైన ఘటన కృష్ణా జిల్లాలో రాజకీయంగా చర్చకు కారణమైంది. ఉద్దేశపూర్వకంగా ఈ కేసు నమోదైందని అప్పట్లో పేర్ని నాని ఆరోపించారు. ఈ ఆరోపణలను మంత్రి కొల్లు రవీంద్ర తోసిపుచ్చారు.

Tags:    

Similar News