ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకనుంచి వారికి అవార్డులు లేవు..

Update: 2019-11-06 07:29 GMT

ఏపీ ప్రభుత్వం అవార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్దులకే అబ్దుల్ కలాం పేరుతో ఉన్న అవార్డులను అందచేయాలని నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చెయ్యాలని సంకల్పించింది. పదో తరగతి ఫలితాల్లో అత్యధిక జీపీఏ సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు అందించే ఈ అవార్డులు ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి మాత్రమే అవార్డుల ఇవ్వనుంది.. వారికే నగదును ఖర్చు చేయనుంది.

ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రతిభ అవార్డులు ఇస్తూ వచ్చారు. అయితే ప్రభుత్వ పాఠశాలలను మరింతగా బలోపేతం చేయడంతోపాటు ప్రైవేటు పాఠశాలలకు కళ్లెం వేయాలన్న ఉద్దేశ్యంతోనే ప్రతిభ అవార్డులను ప్రభుత్వ విద్యార్థులకు మాత్రమే ఇచ్చేలా చర్యలు చేపట్టింది. . ప్రతిభ అవార్డుకు ఎంపికైన విద్యార్థి బ్యాంకు ఖాతాల్లో రూ. 20 వేల చొప్పున నగదు జమచేయనుంది. అలాగే వారికి ట్యాబ్, మెడల్, సర్టిఫికెట్, విద్యార్థి కెరీర్‌కు ఉపయోగపడే పుస్తకాన్ని బహుమానంగా ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. 

Tags:    

Similar News