అమరావతి పరిధి తగ్గిస్తూ.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఉంటాని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Update: 2020-02-08 06:45 GMT

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఉంటాని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అక్కడి రైతులు 50 రోజలుపైగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని ఎక్కడకు తరలించడం లేదని, పరిపాల వికేంద్రీకరణ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అమరావతి రైతులు సీఎం జగన్‌ను కలిసి తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారి డిమాండ్లను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

కాగా.. ప్రభుత్వం అమరావతి నుంచి పెనుమాక, ఉండవల్లి, నవులూరు, బేతపూడి, ఎర్రబాలెం, తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఆ గ్రామాలను తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి, తాడేపల్లి పురపాలక సంఘాల్లో వేర్వేరుగా విలీనం చేస్తూ జీవోలు జారీ చేసింది. తాడేపల్లి, మంగళగిరిలను మోడల్‌ మున్సిపాల్టీలుగా మారుస్తామని గతంలోనే వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతోంది. ఇందుకోసం రూ.1100 కోట్లు ఖర్చు అవసరమని సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే అమరావతి కేపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఏసీసీఎంసీ) పరిధిలో 25 గ్రామ పంచాయతీలతోపాటు కొత్తగా మరో 3 పంచాయతీలను కలిపి ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉండగానే ఐదు గ్రామాలను ప్రభుత్వం తప్పించడం గమనార్హం. అమరావతి నిరసనలకు అడ్డుకట్ట వేయడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అలాగే రెండు గ్రామాలతో సహ ప్రాతూరు, వడ్డేశ్వరం, ఇప్పటం, గుండిమెడ,మల్లెంపూడి, చిర్రావూరు పంచాయతీలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేస్తు ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే మంగళగిరి మున్సిపాలిటీలో ఎర్రబాలెం, నవులూరు, బేతపూడి, తో పాటు ఆత్మకూరు, చినకాకాని పంచాయతీలను విలీనం చేస్తూ జీవో జారీ చేశారు. 

Tags:    

Similar News