Nara Lokesh: డాక్టర్ సుధాకర్ మరణం చుట్టూ రాజకీయం

Nara Lokesh: మాస్క్, పీపీఈ కిట్లు లేవని ప్రభుత్వంపై ఓపెన్ గా విమర్శలు

Update: 2021-05-22 06:37 GMT

నారా లోకేష్ (ఫైల్ ఇమేజ్)

Nara Lokesh: మాస్క్ ఇవ్వటం లేదని.. పీపీఈ కిట్లు లేవని ప్రభుత్వంపై ఓపెన్ గా విమర్శలు చేసి వివాదాస్పద డాక్టర్ గా నిలిచిన విశాఖ నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ చనిపోయారు. గుండెపోటుతో చనిపోయినప్పటికీ.. డాక్టర్ సుధాకర్ మరణం మళ్లీ రాజకీయాలను తట్టి లేపింది. ఆయనది నిస్సందేహంగా ప్రభుత్వ హత్యేనని టీడీపీ నేత లోకేష్ ఆరోపించారు. విమర్శలు చేసినందుకు డాక్టర్ సుధాకర్ ను నానా హింస పెట్టారని.. ఆయనను పిచ్చాసుపత్రిలో చేర్పించి.. మానసికంగా నరకం చూపించారని ఆయన మండిపడ్డారు. ఇదంతా జగన్ ఆదేశాలతోనే జరిగిందని లోకేష్ ఆరోపించారు.

డాక్టర్ సుధాకర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయ్యారు. అది కూడా కోర్టు ఆదేశాలతోనే. అప్పట్లో హైకోర్టు ఆయనకు పిచ్చాసుపత్రిలో వైద్యం చేయించడంపై సీరియస్ అయింది. ఆ తర్వాత ఆయనను మళ్లీ నడిరోడ్డు మీద పోలీసులు కొట్టారు. దానికి రకరకాల సిల్లీ కారణాలు చెప్పారని విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కాలంలో సుధాకర్ సైలెంట్ అయిపోయారు. నా ఉద్యోగం నాకుంటే చాలంటూ జగన్ ను బతిమాలుకున్న వీడియోలు కూడా వచ్చాయి.

మరోవైపు వైసీపీ మాత్రం డాక్టర్ సుధాకర్ ని టీడీపీ వాడుకుందని.. టీడీపీ నేతలను కలిశాకే డాక్టర్ సుధాకర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారని ఆరోపిస్తోంది. చివరకు డాక్టర్ సుధాకర్ తనను ఎందులోకి లాగొద్దని అందరినీ అడిగారని.. టీడీపీ వారికి కూడా అదే చెప్పారని వైసీపీ చెబుతోంది. సహజంగానే ఆరోగ్యం క్షీణించి గుండెపోటుతో చనిపోయారో లేక జరిగిన పరిణామాలతో మానసికంగా బలహీనపడి.. గుండెపోటుతో చనిపోయారో తెలియదు. రాజకీయాలు మాత్రం చెలరేగిపోతున్నాయి.

Tags:    

Similar News