ఏపీ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు..స్టేట్ వెబ్ సైట్ లో ఉంచిన ప్రభుత్వం

కరోనా వైరస్ కొత్త కొత్త ఆలోచనలకు తెర తీస్తోంది. వీలైనంత వరకు సమూహాలు లేకుండా ఏక విధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.

Update: 2020-06-08 12:14 GMT

కరోనా వైరస్ కొత్త కొత్త ఆలోచనలకు తెర తీస్తోంది. వీలైనంత వరకు సమూహాలు లేకుండా ఏక విధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.ఇంతవరకు ఏటా పాఠశాలలు ప్రారంభం కాగానే అందరికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలను ప్రభుత్వమే అందజేసేది. అయితే ఈ సారి వెబ్ సైట్ లో ఉంచి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. వీలైనంత వరకు ఎక్కువ మంది ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది.

ఏపీ విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్ధులకు అన్ని రకాల పాఠ్య పుస్తకాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో allebooks.in/apstate.html వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఈ బుక్స్ అన్నింటినీ కూడా ప్రతీ ఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

అలాగే ncertbooks.guru/ts-scert-books/ ద్వారా తెలంగాణ స్కూల్ బుక్స్ ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే విషయం తెలిసిందే. కాగా, ఒకటి నుంచి ఇంటర్ వరకు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో బుక్స్ విద్యార్ధులకు అందుబాటులో ఉన్నాయి. అటు ఏపీ టెన్త్ క్లాస్ మోడల్ పేపర్లు కూడా ఇందులో లభిస్తాయి.

Tags:    

Similar News