జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకి నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే.. మొత్తం 660 జడ్పీ, 9639 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపద్యంలో

Update: 2020-03-08 11:51 GMT
Andhrapradesh

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకి నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే.. మొత్తం 660 జడ్పీ, 9639 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపద్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.. రాజధాని అమరావతి పరిధిలోని గ్రామ పంచాయతీల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించరాదంటూ... రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. తుళ్లూరు మండలంలోని 19 గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పటీసీ ఎన్నికలను నిలిపివేయాలని లేఖలో ఏపీ ప్రభుత్వం కోరింది. హైకోర్టులో ఉన్న కేసులు, పిటిషన్లను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవలసిందిగా ప్రభుత్వం ఈసీకి విజ్ఞప్తి చేసింది.

ఇక మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలని ఒకే దశలో నిర్వహించాలనీ, సర్పంచ్ ఎన్నికల్ని రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయించారు.ఇక వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని అయన తెలిపారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

మార్చి 7: నోటిఫికేషన్‌ విడుదల

మార్చి 9-11: నామినేషన్ల స్వీకరణ

మార్చి 12: నామినేషన్ల పరిశీలన

మార్చి 14: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది

మార్చి 21: ఎన్నికల పోలింగ్‌

మార్చి 24: ఓట్ల లెక్కింపు

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌

మార్చి 9: నోటిఫికేషన్‌ విడుదల

మార్చి 11-13: నామినేషన్ల స్వీకరణ

మార్చి 14: నామినేషన్ల పరిశీలన

మార్చి 16: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది

మార్చి 23: ఎన్నికల పోలింగ్‌

మార్చి 27: ఓట్ల లెక్కింపు

పంచాయతీ ఎన్నికల తొలి విడత షెడ్యూల్‌

మార్చి 15: నోటిఫికేషన్‌ విడుదల

మార్చి 17-19: నామినేషన్ల స్వీకరణ

మార్చి 20: నామినేషన్ల పరిశీలన

మార్చి 22: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది

మార్చి 27: ఎన్నికల పోలింగ్‌

మార్చి 27: ఓట్ల లెక్కింపు

పంచాయతీ ఎన్నికల రెండో విడత షెడ్యూల్‌

మార్చి 17: నోటిఫికేషన్‌ విడుదల

మార్చి 19-21: నామినేషన్ల స్వీకరణ

మార్చి 22: నామినేషన్ల పరిశీలన

మార్చి 24: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది

మార్చి 29: ఎన్నికల పోలింగ్‌

మార్చి 29: ఓట్ల లెక్కింపు 

Tags:    

Similar News