గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్‌ తండ్రిలా వ్యవహరించారన్న జగన్

*ఏపీ గవర్నర్ హరిచందన్‌కు వీడ్కోలు సభ

Update: 2023-02-21 08:23 GMT

గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్‌ తండ్రిలా వ్యవహరించారన్న జగన్ 

Vijayawada: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్‌కు ఏపీ ప్రభుత్వం వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య మంత్రి జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గవర్నర్ వ్యవస్థకు హరిచందన్ నిండుతనం తెచ్చారని కొనియాడారు. రాజ్యాంగ వ్యవస్థలో సమన్వయాన్ని ఆచరణలో చూపారన్నారు. ఒక తండ్రిలా. పెద్దలా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అండగా నిలిచారని జగన్ అన్నారు. తరువాత గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ ప్రజలు తనకిచ్చిన గౌరవాన్ని ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. ముఖ్యమంత్రి జగన్ తో తన జర్నీ సంతోషంగా జరిగిందన్నారు. సంక్షేమ పథకాల అమలుపై జగన్ ను గవర్నర్ హరిచందన్ ప్రశంసించారు.

Tags:    

Similar News