త్రివిధ రాజధానులపై అఖిలపక్ష సమావేశానికి ఏపీ ప్రభుత్వ నిర్ణయం

Update: 2019-12-21 06:30 GMT
జగన్

ఓ వైపు త్రివిధ రాజధానులపై రగడ మరో వైపు జీఎన్ రావు కమిటీపై భిన్న స్వరాలు వినిపిస్తున్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. త్రివిధ రాజధానులతో పాటు అమరావతినే కొనసాగించడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

జనవరి తొలి వారంలో సమావేశం నిర్వహించాలని భావిస్తున్న జగన్ ప్రభుత్వం శాసనసభలో ప్రాతినిద్యం వహిస్తున్న టీడీపీ, జనసేనలతో పాటు కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులను కూడా ఆహ్వానించనుంది. ఇదే సమయంలో ప్రజా సంఘాలను కూడా సమావేశాలకు పిలిచి అభిప్రాయాలు సేకరించనుంది. ఏపీ సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై జీఎన్ రావు కమిటీ అందజేసిన నివేదికపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. విపక్షాల అభిప్రాయాలు తీసుకున్న తరువాతే త్రివిధ రాజధానులపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. 

Full View

Tags:    

Similar News