ఏపీ ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌ కుమార్‌ తొలగింపు

Update: 2020-04-10 11:52 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏపీ ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ ను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల కమిషనర్ నియామక నిబంధనల మార్పు ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపారని. దీంతో వెంటనే ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిందని. ప్రభుత్వానికి సంక్రమించిన అధికారంతో ఎన్నికల కమిషనర్ ను తొలగిస్తూ.. జీవో జారీ చేసిందని. ఇందుకు సంబంధించి రెండు జీవోలను ఏపీ ప్రభుత్వం రహశ్యంగా పెట్టిందని ప్రచార సారాంశం.  

కాగా, స్థానిక ఎన్నికల్లో వైసీపీ అవకతవకలకు పాల్పడుతోందంటూ  రమేష్ కుమార్  తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని కేంద్రానికి లేఖ రాశారు.  తనకు రాష్ట్రంలో వ్యతిగత భద్రత లేదంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఆయనకు కేంద్రం సీఆర్పీఎఫ్ భద్రతను కల్పించింది. ఈ నేపధ్యంలో రమేష్ కుమార్ వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసి రమేష్ కుమార్ వ్యవహారం పై ఫిర్యాదు చేశారు. 

కరోనా సమయంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సరికాదని నిర్ణయాత్మకంగా వ్యవహరించిన రమేష్ కుమార్ పై ఇప్పుడు వేటు వేయడంతో రాజకీయ వర్గాల్లో కలకలం .రేగుతోంది. నిష్పాక్షికంగా వ్యవహరించే అధికారులను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని మరోసారి రుజువైందంటూ విపక్ష నేతల విమర్శలు చేస్తున్నారు. ఇదే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గవర్నర్ కు లేఖ రాసినట్టు తెలుస్తోంది. పూర్తీ వివరాలు ఇంకా అందాల్సి ఉంది. 

Tags:    

Similar News