ఏపీలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు.. 11 వందల కోట్లు విడుదల చేసిన జగన్
* ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్ పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది.
జగన్ (ట్విట్టర్ ఫోటో)
YS Jagan: ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్ పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. వేయి 124 కోట్ల నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పరిశ్రమల ద్వారా 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామని చెప్పారు జగన్. పరిశ్రమలు తెచ్చేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.