Andhra Pradesh: ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఏపీ ప్రభుత్వం భరోసా

Andhra Pradesh: కోవిడ్ తో మరణించి వైద్యులు, వైద్య సిబ్బందికి ఎక్స్ గ్రేషియా మంజూరు

Update: 2021-06-14 10:40 GMT

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: జూనియర్ డాక్టర్ల డిమాండ్లలో కీలకమైన ఎక్స్ గ్రేషియా డిమాండ్ ను నెరవేర్చుతూ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు ఏపీ ప్రభుత్వం భరోసా కల్పించింది. కోవిడ్ తో మరణించిన వైద్యులు, వైద్య సిబ్బందికి ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తూ వైద్యఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ విధినిర్వాహణలో మరణించిన వైద్యుని కుటుంబానికి 25 లక్షలు, స్టాఫ్ నర్స్ కు 20 లక్షలు, ఎఫ్ఎన్ఓ లేదా ఎంఎన్ఓ కు 15 లక్షలు, ఇతర వైద్య సిబ్బంది మృతి చెందితే పది లక్షలు చొప్పు ఎక్స్ గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రకటించింది.

ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనానితో జూడాలు జరిపిన చర్చల్లో ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. మంత్రి ఆళ్లనాని విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం చెల్లించే ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ పథకానికి అదనంగా ఈ ఎక్స్ గ్రేషియా చెల్లిస్తున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News