ఫిబ్రవరిలోనే ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ?
AP Election Notification: వైసీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఫిబ్రవరిలోనే ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ?
AP Election Notification: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక దేశంలో సాధారణ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీకలపై చర్చ ప్రారంభమైంది. అయితే, ఇప్పుడు వైసీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుందా ? ఆయన చెప్పిన దాని ప్రకాంరం ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ తరువాత ఎన్నికలు జరిగి పోతాయా ? ఎన్నికల నోటిఫికేషన్ కి ఇంకా రెండు నెలలే సమయం ఉంది. ఆతరువాత నెల రోజులకే ఎన్నికలు జరిగిపోతాయని ఆయోధ్య రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అంతే కాదు ఏపీలో ఏన్నికల వేడి మొదలైంది. అందుకే వైసీపీ మార్పులు, చేర్పులు చేస్తోందన్నారు.
ఆయోధ్యరామిరెడ్డి అధికార పార్టీకి చెందిన ఎంపీ ఆయన మాటలను ఆషామాషీగా తీసి పడేయలేం. ఆయనకు పూర్తి క్లారిటి ఉంటుంది.. ఆ క్లారిటీతోనే ఆయన ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఉండవచ్చు. ఎన్నికలు మే నెలలో జరిగేతే వేసవి ప్రభావం ఓటింగ్ మీద పడుతుందని ఎన్నికల సంఘం కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. . వేసవి కాలం జరిగే ఎన్నికల కంటే, శీతాకాలం జరిగే ఎన్నికలకు ఓటింగ్ శాతం పెరుగుతుందని తెలుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కూడా ఎన్నికల సంఘం ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకుని ఊపు మీదున్న బీజేపీ అదే కొనసాగించాలని చూస్తోంది. ప్రతిపక్షాలకు కోలుకునేందుకు సమయం ఇవ్వకూడదని భావిస్తోంది. ఈసారి కూడా వేసవి ప్రభావం తీవ్రంగా ఉంటుందనే అంచనాల నేపధ్యంలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సహా సాధారణ ఎన్నికల్ని నెలన్నర ముందుకు జరిపే ఆలోచనలో ఎన్నికల సంఘం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం మే నెలలో ఎన్నికలు జరిగితే, ఏప్రిల్ మొదటి వారంలోకానీ, మార్చిలో కానీ నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఇప్పుడు ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వస్తే, మార్చి చివరి వారంలో ఎన్నికల పోలింగ్ ఉండే అవకాశముంది.
2019లో ఎన్నికల నోటిఫికేషన్ మార్చ్ 10వ తేదీన విడుదలైంది. మేలో ఎన్నికలు జరిగాయి. ఈ సారి మాత్రం ఫిబ్రవరి మొదటి వారంలోనే నోటిఫికేషన్ వస్తే మార్చి, ఏప్రిల్ లో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. వైసీపీకి చెందిన ఎంపీ ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పారంటే, ఏపీ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటుందని బావించవచ్చు. ఇప్పటికే ఓటర్ లిస్ట్ ను అప్‌డేట్ చేస్తున్నారు
ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఏపీలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్ని ఈసారి త్వరగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. గత ఏడాది మార్చ్ 15 నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకూ ఇంటర్ పరీక్షలు జరిగితే, పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 18కు వరకూ జరిగాయి. ఈసారి మాత్రం ఇంటర్ పరీక్షల్ని మార్చ్ మొదటి వారంలో ప్రారంభించేందుకు, పదవ తరగతి పరీక్షల్ని మార్చ్ 20 నుంచి నెలాఖరు వరకూ పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.