AP Dy CM Pushpavani at Paderu: రూ. 33.39 కోట్లతో పలు పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సిఎం పుష్పవాణి

AP Dy CM Pushpavani at Paderu: ఏపీ డిఫ్యూటీ సీఎం, గిరిజన మంత్రి పాముల పుష్పవాణి పాడేరులో పర్యటిస్తున్నారు.

Update: 2020-07-07 09:10 GMT
AP Deputy CM Pushpa Srivani

AP Dy CM Pushpavani at Paderu: ఏపీ డిఫ్యూటీ సీఎం, గిరిజన మంత్రి పాముల పుష్పవాణి పాడేరులో పర్యటిస్తున్నారు. ఆమె ముందుగా పాడేరు చేరుకున్నాక మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలించారు. దీంతో పాటు రూ. 33,39 కోట్లతో చేపట్టే పలు పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే ఐటీడీ సమావేశ మందిరంలో పలు శాఖలకు చెందిన అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వచ్చే నెలలో అర్హులైన అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులందరికీ పట్టాలు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు.

దివంగత వైఎస్సార్‌ రైతును రాజు చేయాలన్న ఆలోచనతో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులందరికీ భూమి హక్కు పత్రాలు ఇచ్చారన్నారు. ఆ తరువాత వచ్చిన పాలకులు ఆదివాసీల గురించి పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన తరువాత గిరిజనులు నమ్ముకున్న పోడు వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. తన పాదయాత్రలో గిరిజనుల సమస్యను తెలుసుకున్న ఆయన అటవీ శాఖ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా పోడు వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ ఆర్‌వోఎఫ్‌ఆర్‌ (రికార్డ్స్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌) కింద పట్టాలివ్వాలని ఆదేశించారన్నారు.

ఇప్పటి వరకు 87,166 మంది గిరిజన రైతులు 1,64,616 ఎకరాలపై సాగు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీటిపై పరిశీలన కొనసాగుతోందన్నారు. ఆ భూమిలో ఎవరు వ్యవసాయం చేస్తుంటే వారి పేరుతోనే పట్టా ఇస్తారని ఆమె పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సర్వే ఇప్పటికే దాదాపుగా పూర్తయిందని ఆమె పేర్కొన్నారు. ఇదేకాకుండా గిరిజనుల అన్ని సమస్యలను పరిష్కరించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారన్నారు. . కార్యక్రమంలో పాడేరు, ఎంపీ మాధవి, అరకు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.  

Tags:    

Similar News