తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
Tirumala: దేశంలో అవినీతి పోవాలంటే ప్రత్యక్ష ఎన్నికలే మార్గం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
Tirumala: ప్రత్యక్ష ఎన్నికలతోనే దేశంలో అవినీతి మాయమవుతుందని ఏపీ డిప్యూటీ సీఎం కె.నారాయణ స్వామి అన్నారు. తిరుమల శ్రీవారిని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దర్శించుకున్నారు. ప్రత్యక్ష ఎన్నికలంటే తనకు ముందు గుర్తుకొచ్చేది ఇందిరా గాంధీ, ఎన్టీఆరేనని చెప్పారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఎన్టీఆర్ సీఎం అయ్యారని ఆయన గుర్తుచేశారు. ఎన్టీఆర్ గెలిపించుకున్న ఎమ్మెల్యేలను చంద్రబాబు ఎలా కొన్నాడో అందరికి తెలుసని ఆయన ఉదాహరించారు. డైరెక్ట్ ఎన్నికలతో అమ్ముడు పోయే రాజకీయాలకు స్వస్తి పలకవచ్చని, అవినీతి కూడా 80 శాతం తగ్గుతుందని నారాయణస్వామి కామెంట్స్ చేశారు.