YS Jagan ఢిల్లీ టూర్.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇవాళ ఢిల్లీకి చేరుకొనున్నారు.

Update: 2020-02-14 03:25 GMT
జగన్, అమిత్ షా ఫైల్ ఫోటో

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇవాళ ఢిల్లీకి చేరుకొనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంత్రి అమిత్ షాతో సహా పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని శనివారం శనివారం మధ్యాహ్నానికి సీఎం జగన్‌ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

కాగా, ఈ నెల 12న జగన్‌ ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ సమావేశమై రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై కూలంకుషంగా చర్చించారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం ఇటీవలే ప్రధాని మోడీకి లేఖ రాసిన సీఎం ఈ భేటీ సందర్భంగా తాను లేఖలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు.

హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోడీతో ఆయన నివాసంలో గంటన్నరకు పైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ప్రధానికి ఆయన నివేదించారు. విభజన అంశాలు, ప్రత్యేకహోదా, పోలవరం నిధులు తదితర అంశాలపై సీఎం వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఉగాది రోజున 25లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి రావాల్సిందిగా మోడీని జగన్‌ ఆహ్వానించింన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మరోసారి ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. 

Tags:    

Similar News