రేపు ఏపీ సీఎం జగన్ విశా‌ఖ పర్యటన

Update: 2019-12-27 16:55 GMT
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి

రేపు విశాఖ నగరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు విశాఖ ఉత్సవ్ జరగనుంది. ఈ ఉత్సవాల్లో సీఎం పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం నుంచి సీఎం జగన్ విశాఖకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3.50 నుంచి 4.20 నిమిషాల మధ్య కైకైలాస గిరిపై రూ.37 కోట్లతో ప్లానిటోరియం పనులకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. 4.40 నుంచి 5.10 నిమిషాల మధ్య వైఎస్‌ఆర్‌ వుడా సెంట్రల్ పార్క్‌లో రూ.380 కోట్ల అంచనా వ్యయంతో వీఎంఆర్‌డీఏ పనులు, రూ. 800 కోట్లతో జీవీఎంసీ పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల మధ్య రామకృష్ణ బీచ్ వద్ద విశాఖ ఉత్సవ్ 2019 ప్రారంభోత్సవం చేయనున్నారు. రాత్రి 7.40 నిమిషాలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా విశాఖను ప్రకటించి.. ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రదాతగా చెరగని స్థానం సంపాదించుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ఆ ప్రాంత ప్రజలు సన్నద్ధమవుతున్నారు. రాజధాని ప్రకటన తర్వాత తొలిసారి విశాఖ పర్యటనకు వస్తున్న సీఎంకు 24 కిలోమీటర్ల మేర మానవ హారంగా ఏర్పడి అభినందన మాల అందించాలని పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. 

Tags:    

Similar News