CM Jagan: వైద్య, ఆరోగ్యశాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష

CM Jagan: విద్య, వైద్యం రంగాలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం

Update: 2022-04-12 11:01 GMT

వైద్య, ఆరోగ్యశాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష

CM Jagan: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆసుపత్రుల్లో ప్రజలు సులువుగా వైద్యసేవలు పొంద విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్ సూచించారు. వైద్యఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఆసుపత్రులలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్‌ మోడల్‌ను పరిశీలించారు. దశాబ్దాలుగా మార్పులకు నోచుకోని విద్య, వైద్యంవంచి రంగాల్లో వ్యవస్థలను మార్చాలానిలక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం జగన్ చెప్పారు.

విద్యా, వైద్యం, వ్యవసాయ, గృహ నిర్మాణం వంటి రంగాల్లో చారిత్రాత్మక మార్పులు తీసుకు వచ్చామని చెప్పారు. వైద్య రంగంలో ఎప్పడూ లేని విధంగా వేల కోట్లు ఖర్చు చేస్తూ ఖాళీలను భర్తీ చేశామని చెప్పారు. విలేజ్,వార్డ్ క్లీనిక్స్ నుంచి టీచింగ్ ఆసుపత్రుల వరకు నాడు-నేడు కింద అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. శాఖాధిపతులు,వారికింద పని చేస్తున్న సిబ్బంది ఛాలెంజ్ గా స్వీకరించాలని కోరారు.   

Tags:    

Similar News