ఏపీ సీఎం జగన్‌ మరో సంచలన నిర్ణయం

Update: 2019-07-02 13:32 GMT

ప్రజాసమస్యల పరిష్కారమే తన ప్రథమ ప్రాధాన్యతని మరోసారి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమంపై రివ్యూ నిర్వహించిన జగన్‌ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారో లేదో క్రాస్‌ చెక్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. తాను కూడా ఆకస్మిక తనిఖీలు చేపడతానన్న సీఎం జగన్మోహన్‌రెడ్డి రచ్చబండ ప్రోగ్రామ్‌లో వాటిని క్రాస్ చెక్ చేస్తానన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజాసమస్యల పరిష్కారమే తన ప్రథమ ప్రాధాన్యతన్న జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీవెన్స్‌ సెల్‌ స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో రివ్యూ నిర్వహించారు. నిర్ణీత గడువులోగా ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న సీఎం జగన్మోహన్‌‌రెడ్డి అధికారుల పనితీరుపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అంతేకాదు అసలు ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి తాను కూడా ఆకస్మిక తనిఖీలు చేపడతానన్న జగన్‌ రచ్చబండ ప్రోగ్రామ్‌లో వాటిని క్రాస్‌ చెక్‌ చేస్తానన్నారు.

సోమవారంనాడు మొదటిసారి చేపట్టిన స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహిచిన సీఎం జగన్మోహన్‌‌రెడ్డి ప్రజల నుంచి రియాక్షన్ ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఇస్తున్న వినతిపత్రాలకు రసీదులు ఇవ్వాలని, అలాగే ఎప్పటిలోగా పరిష్కరిస్తారో కచ్చితంగా రాసివ్వాలని అధికారులకు సూచించారు. అలాగే నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రజల వినతులను, రసీదులను కంప్యూరైజ్డ్‌ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

జగన్ ప్రభుత్వం చేపట్టిన గ్రీవెన్స్‌ సెల్‌ స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అధిక సంఖ్యలో వినతులు వెల్లువెత్తాయి. ప్రజా స్పందనను గమనించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌‌రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతో రివ్యూ నిర్వహించారు. అంతేకాదు ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం తర్వాత ఆ మరుసటి రోజు అంటే మంగవారం కలెక్టర్లు, ఎస్పీలతో రివ్యూ నిర్వహించనున్నట్లు జగన్ స్పష్టంచేశారు.

Full View

Tags:    

Similar News