Andhra Pradesh: ఏపీ సర్కార్ మరో కొత్త పథకానికి శ్రీకారం
Andhra Pradesh: ఆర్థికంగా వెనుకబడిన ఓసీల కోసం.. వైఎస్‌ఆర్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల
ఏపీ సర్కార్ మరో కొత్త పథకానికి శ్రీకారం
Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఆర్థికంగా వెనుకబడిన ఓసీల కోసం వైఎస్‌ఆర్ ఈబీసీ నేస్తం మొదటి విడత పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓసీ సామాజిక వర్గాలకు 589 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
వైఎస్‌ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ప్రతీ సంవత్సరం 15వేల రూపాయల చొప్పున మూడేళ్లలో మొత్తం 45వేలు ఆర్థిక సాయం అందించనున్నారు.