ఒక్కో కుటుంబానికి రూ.5వేలు ఇవ్వండి: జగన్‌

Update: 2019-08-08 10:40 GMT

పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న జగన్ నేరుగా హెలికాప్టర్ లో ఏరియల్ సర్వేకు బయల్దేరు వెళ్లారు. వరద ముంపుపై అధికారులతో జగన్ సమీక్షించారు. 70 శాతానికి పైగా గిరిజన గ్రామాలు ముంపునకు గురయ్యాయని పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పరిహారంతో పాటు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ముంపు బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్నారు. పునరావాస శిబిరాలకు తరలించిన కుటుంబాలకు భోజనాలు అందించాలని అధికారులకు సూచించారు. వాటితో పాటు అదనంగా ఆయా కుటుంబాలకు రూ.5వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశించారు. వరదల కారణంగా వారి జీవనోపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకనే ప్రత్యేకంగా ఈ రూ.5వేలు సహాయం అందించాలని అధికారులకు సీఎం సూచించారు. మానవతా దృక్పథంతో గిరిజనులను ఆదుకోవాల్సి ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సీఎం వెంట మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.  




 




 


Tags:    

Similar News