సంచలన వ్యాఖ్యలతో హీట్ పెంచిన సీఎం చంద్రబాబు

Update: 2019-01-02 02:19 GMT

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిన్న(మంగళవారం) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పై టీడీపీ విమర్శలు చేయడంలేదని వైసీపీ, బీజేపీ అంటున్నాయని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే జగన్ కు నొప్పేంటి అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పోటీచేస్తుంటే జగన్ కు ఎందుకు భయం. పవన్ మాతో రాకూడదనే ఈ మద్యనే జగన్.. పవన్ ను తిడుతున్నారని అన్నారు. అసలు జగన్ ఎవరితో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తోంది. బీజేపీపై పోరాటానికి కలిసిరావాలని పవన్ కు కోరుతున్నాం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దాంతో ఏపీలో పొలిటికల్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది.సంచలన వ్యాఖ్యలతో హీట్ పెంచిన సీఎం చంద్రబాబు 

Similar News