Chandrababu: ఆలయ విస్తరణకు భూమిని ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు

Chandrababu: అమరావతిలో టీటీడీ ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు.

Arun Chilukuri
Published on: 27 Nov 2025 2:42 PM IST
Chandrababu: ఆలయ విస్తరణకు భూమిని ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు
X

Chandrababu: ఆలయ విస్తరణకు భూమిని ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు

Chandrababu: అమరావతిలో టీటీడీ ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. 2019లో ఆలయాన్ని నిర్మించినప్పుడే రాజధానికి అమరావతి అని పేరు పెట్టాలని.. ఆ వెంకటేశ్వరుడే తనకు సంకల్పాన్ని ఇచ్చారని చంద్రబాబు అన్నారు. అలాగే ఆలయ విస్తరణకు సహకరించి భూమిని ఇచ్చిన రాజధాని రైతులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. తాము ఆలయ విస్తరణకు 25 ఎకరాల భూమిని ఇచ్చామని, దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో.. ఆ నమునాలోనే రాష్ట్ర రాజధాని అమరావతి ఉండాలని తాను కోరుకుంటున్నానని అధికారులకు సీఎం సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story