ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఆ కాలనీలకు వైఎస్సార్ జగనన్న కాలనీలుగా నామకరణం

Update: 2020-03-04 10:04 GMT
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పేదలకు ఇచ్చే కాలనీలకు వైఎస్సార్ జగనన్న కాలనీలుగా నామకరం చేయాలని నిర్ణయించినట్లు ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు.

ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేసేందుకు 43,141 ఎకరాల భూమి సిద్దం చేసినట్లు చెప్పారు. ఇందులో 26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, 16,164 ఎకరాల ప్రైవేట్ భూమి కొనుగులు చేసినట్లు చెప్పారు. ఎన్‌పీఆర్‌లో మార్పులు కోరుతూ కేబినెట్‌ తీర్మానించింది భోగాపూరం ఎయిర్‌పోర్టు, రామాయపట్నం పోర్టు నిర్మాణాలపై చర్చించినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.   

Tags:    

Similar News