టీడీపీ, జనసేన విమర్శలను పట్టించుకోని ప్రభుత్వం.. సంచలన నిర్ణయాలకు ఓకే..

Update: 2019-11-13 09:51 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. తాడేపల్లిలో రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కీలకంగా మారిన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో వచ్చే ఏడాది నుంచి ఒకటవ తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను తప్పని సరి చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనిపై తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా వెనక్కితగ్గలేదు. అలాగే ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇకనుంచి ఇసుక అక్రమ రవాణా చేసినా, ఎక్కువ ధరలకు అమ్మినా రెండేళ్లు జైలు శిక్ష పడేలా చట్టాన్ని తేనుంది. ఇసుక విషయంలో ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా రేపటినుంచి ఇసుక వారోత్సవాలు జరపాలని క్యాబినెట్ అభిప్రాయపడింది.

అంతేకాదు మొక్కజొన్న రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి వర్గం అభిప్రాయపడింది.. రైతులు నష్ట పోకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. త్వరగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. మొక్కజొన్న క్వింటాలు ధర రూ.2200 ఉండేదని.. ఇప్పుడు రూ.1500కు పడిపోయిందని రైతులకు కనీస మద్దతు ధర రూ.1750 కూడా రావడం లేదని మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు ప్రస్తావించడంతో దీనిపై చర్చ జరిగింది.  

Tags:    

Similar News