AP Budget 2025-26: రూ. 3.22 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2025-26 బడ్జెట్ ను ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ప్రవేశపెట్టారు. రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టారు
రూ. 3.22 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2025-26 బడ్జెట్ ను ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ప్రవేశపెట్టారు. రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశ పెట్టింది. రెవిన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ. 40,635 కోట్లు, రెవిన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్యలోటు 79,926 కోట్లుగా అంచనా వేశారు.
బడ్జెట్‌లో పలు రంగాలకు కేటాయించిన నిధులు
ఎస్సీ సంక్షేమం రూ.20,281 కోట్లు
బీసీ సంక్షేమం రూ.47,456 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖ రూ.19, 264 కోట్లు
పాఠశాల విద్యకు రూ. 31,805 కోట్లు
ఉన్నత విద్యకు రూ. 2,506 కోట్లు
పంచాయితీరాజ్ శాఖకు రూ. 18,847 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ. 13, 862 కోట్లు
నీటి పారుదల శాఖకు రూ. 18,019 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ. 3,156 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ. 3,806 కోట్లు
తెలుగు భాష ప్రచారం, అభివృద్దికి రూ., 10 కోట్లు
తల్లికి వందనం రూ. 9,407 కోట్లు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రూ.27,518 కోట్లు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం రూ.3,486 కోట్లు
ఆదరణ పథకం రూ.1000 కోట్లు
దీపం పథకం రూ.2,601 కోట్లు
అమరావతి నిర్మాణానికి రూ. 6,000 కోట్లు
వ్యవసాయ బడ్జెట్ రూ. 48 వేల కోట్లు
పోలవరం నిర్మాణం రూ. 6,705 కోట్లు