ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలకు ఈరోజే చివరి రోజు

Update: 2019-07-30 02:34 GMT

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఇప్పటి వరకూ 16 బిల్లులకు ఆమోదించిన శాసనసభ.. నిన్న ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదించింది. ఇక జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటుతో పాటుగా శాశ్వత బిసీ కిమిషన్, పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉపాధి కల్పన, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారీటీలకు నామినెటెడ్ పదవుల్లో 50శాతం కేటాయింపు వంటి కీలక బిల్లులను అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

అయితే ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా..ఇవాళ అసెంబ్లీ ముట్టడికి ఎమ్మార్పీఎస్ పిలుపునివ్వడంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఎర్పాటు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా నేడు ప్రశ్నోత్తరాలకు ఎక్కువ సమయం కేటాయించనున్నారు.ప్రధానంగా అన్న క్యాంటీన్‌ల మూసివేత, నిరుద్యోగ భృతి, విజయవాడ నుంచి విమాన సర్వీసుల నిలిపివేత, అమరావతిలో మంత్రులు, అధికారుల క్వార్టర్ల నిర్మాణం పురోగతిపై టీడీపీ సభ్యులు ప్రశ్నలు నేడు అసెంబ్లీలో లేవనెత్తనున్నారు. కాగా ఈనెల 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News