AP Assembly: 9 రోజులపాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. బీఏసీలో కీలక నిర్ణయం

AP Assembly: 24వ తేదీ వరకు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు

Update: 2023-03-14 08:10 GMT

AP Assembly: 9 రోజులపాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. బీఏసీలో కీలక నిర్ణయం

AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అనంతరం సభ వాయిదా పడింది. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 9 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 24 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. 16న రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 19, 22తేదీల్లో అసెంబ్లీకి సెలవు ఉంటుంది. బీఏసీ సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది.

Tags:    

Similar News