AP ASHA Worker Jobs 2025: గ్రామీణ మహిళలకు శుభవార్త.. ఏపీలో ఆశా వర్కర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..!

AP ASHA Worker Jobs 2025: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ మహిళలకు శుభవార్త. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆశా వర్కర్క నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2025-06-26 06:25 GMT

AP ASHA Worker Jobs 2025: గ్రామీణ మహిళలకు శుభవార్త.. ఏపీలో ఆశా వర్కర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..!

AP ASHA Worker Jobs 2025: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ మహిళలకు శుభవార్త. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆశా వర్కర్క నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్దులు జూన్ 30 తేదీలోపు సంబంధిత మెడికల్ ఆఫీసర్‌‌కు అప్లికేషన్లను స్వయంగా సమర్పించాలి. ఈ నోటిఫికేషన్‌లో ఉన్న మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు (accredited Social Health Activist) నియామకానికి ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద అన్నమయ్య జిల్లాలో మొత్తం 1294 పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించాలని అనుకునేవారు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. అదేవిధంగా.. ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్దులు అదే గ్రామానికి చెందిన మహిళగా ఒక గుర్తింపు సర్టిఫికేట్‌(నివాస ధ్రువీకరణ పత్రం)ను అప్లికేషన్‌తో పాటు జత చేసి ఇవ్వాలి. వీటితో పాటు ఏదైనా గుర్తింపు పొందిన స్కూలు నుంచి 10వ తరగతి పాసైన సర్టిఫికేట్ కూడా జత చేయాలి. ఇంకా, అభ్యర్దులు మెరుగైన సామర్ధ్యాలను కలిగి ఉండడంతో పాటు వయోపరిమితి 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్ధులు నోటిఫికేషన్‌లో ఇచ్చిన ధరఖాస్తు ఫారమ్‌ను డౌన్ లోడ్ చేసుకుని, పాస్ ఫోటో, స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం, విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, తల్లితండ్రులు, అడ్రస్ వివరాలు వంటివి సంబంధిత మెడికల్ ఆఫీసర్‌‌కి ఇవ్వాలి. అయితే, ఈ నెల 30లోపు అప్లికేషన్లను స్వయంగా అందజేయాలి. ఆ తర్వాత ఎంపికైన అభ్యర్దులకు శిక్షణ ఉంటుంది. గ్రామానికి ఒక ఆశా వర్కర్ చొప్పిన పోస్టింగ్ ఉంటుంది. శిక్షణ తర్వాత వెంటనే విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News