AOB Encounter: ఏవోబీలో ఎన్కౌంటర్.. ఒకరు మరణం

AOB Encounter: ఏవోబీలో వరుస ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన పోలీసుల ఎదురు కాల్పుల్లో అగ్రనేతలు తప్పించుకున్నట్టు తెలుస్తోంది.

Update: 2020-07-27 04:51 GMT
AOB encounter: one maoist killed

AOB Encounter: ఏవోబీలో వరుస ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన పోలీసుల ఎదురు కాల్పుల్లో అగ్రనేతలు తప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘటనలో మరణించిన మావోయిస్టు మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. సోమవారం దీనికి పోస్టుమార్టం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆంధ్ర-ఒడి శా సరిహద్దు(ఏవోబీ)లో గత 10 రోజుల్లో మూడో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా గుజ్జేడు అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మరణించాడు. ఇతడిని విశాఖ ఏజెన్సీలోని వాకపల్లికి చెందిన పాంగి పేతూరు అలియాస్‌ దయ (23)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో మావోయిస్టు అగ్రనేతలు మళ్లీ తప్పించుకున్నారని తెలిపారు. ఒడిశా సరిహద్దులో ఈ నెల 16న జరిగిన ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టులు. విశాఖ ఏజెన్సీలోకి ప్రవేశించారనే సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు.

19న పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ లండులు అటవీ ప్రాంతంలో ఇరుపక్షాల మధ్య మళ్లీ ఎదురు కాల్పులు జరిగా యి. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్‌కే అలియాస్‌ అక్కిరాజు హరగోపాల్‌ త్రుటిలో తప్పించుకోగా.. చలపతి, అరుణల కు బుల్లెట్‌ గాయాలైనట్లు గుర్తించారు. వీరికోసం గాలింపు చర్యలను ఉధృతం చేశారు. కాగా.. దయ అన్న పాంగి దాసురామ్‌ 2016 అక్టోబరులో జరిగిన రామ్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. అన్న మరణం తర్వాత దయ మావోయిస్టుల్లో చేరినట్టు తెలిసింది.  

Tags:    

Similar News