64 ఎన్‌కౌంటర్లు చేసిన రిటైర్డ్ డీఎస్పీ ఆత్మహత్య

64 ఎన్‌కౌంటర్లు చేసిన రిటైర్డ్ డీఎస్పీ ఆత్మహత్య
x
Highlights

బీహార్‌ లో 37 సంవత్సరాల పోలీసు విభాగంలో పనిచేసి 64 ఎన్‌కౌంటర్లు చేసి రికార్డుల్లోకెక్కిన రిటైర్డ్ డీఎస్పీ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.

బీహార్‌ లో 37 సంవత్సరాల పోలీసు విభాగంలో పనిచేసి 64 ఎన్‌కౌంటర్లు చేసి రికార్డుల్లోకెక్కిన రిటైర్డ్ డీఎస్పీ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. బీహార్ కు చెందిన కృష్ణ చంద్ర (68) తన లైసెన్స్‌ పిస్టల్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రను రాష్ట్రంలో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్ ఇన్‌స్పెక్టర్‌గా పిలిచేవారు. తన ఆత్మహత్యకు గల కారణాలను సూసైడ్ నోట్ లో వెల్లడించారు. అందులో డిఎస్పి చంద్ర తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా మంచం పట్టారు. అయితే సడన్ గా ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఇక సూసైడ్ నోట్ లో కృష్ణ చంద్ర ఇలా పేర్కొన్నారు.

'నన్ను క్షమించు..(భార్యను ఉద్దేశించి) డిప్రెషన్ కారణంగా నేను నెలల తరబడి మంచం పట్టాను. ఈ దుఃఖంను నేను ఇక భరించలేను. అందువల్ల, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. బంటీ(చిన్న కుమారుడు) నువ్వు ఎస్బిఐ శాఖకు వెళ్లి నా పెన్షన్ నిలిపివేసి అమ్మకు వచ్చే విధంగా చెయ్యి, ఇంటి అవసరాల నిమిత్తం నా మొబైల్ పనిచేస్తుంది' అని పేర్కొన్నారు. అంతేకాదు తాను గత 16 సంవత్సరాలుగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నానని.. ఇందుకు వైద్యులు చాలా చికిత్సలు చేసారని.. అయినా లాభం లేకుండా పోయిందని.. అలాగే సంతేష్ సిన్హా వేధింపుల కారణంగా మరింత అనారోగ్యానికి గురయ్యానని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories