Tirumala: తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత

Tirumala: ఇప్పటివరకు 6 చిరుతలను బంధించిన అధికారులు

Update: 2023-09-20 10:09 GMT

Tirumala: తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది. శ్రీవారి ఆలయానికి వెళ్లే నడకదారిలో తెల్లవారుజామున మరో చిరుత బోనులో పట్టుబడింది. కాగా, నడకదారిలో వారం రోజులుగా అటవీశాఖ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించారు. చిరుత సంచరిస్తుందన్న సమాచారంతో అధికారులు బోనులు ఏర్పాటు చేశారు. బోనులు ఏర్పాటు చేయడంతో చిరుత బోనులో చిక్కింది. అయితే, చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే తాజాగా చిరుత చిక్కింది. ఇక, చిరుతను జూపార్క్‌కు తరలించడానికి అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. తిరుమలలో ఇప్పటి వరకు ఆరు చిరుతలను అటవీశాఖ అధికారులు బంధించారు.

Tags:    

Similar News