Tirumala: తిరుమలలో వైభవంగా అన్నమయ్య వర్ధంతి వేడుకలు
Tirumala: ఆకట్టుకున్న అన్నమయ్య, సప్తగిరి సంకీర్తనలు
Tirumala: తిరుమలలో వైభవంగా అన్నమయ్య వర్ధంతి వేడుకలు
Tirumala: తిరుమల శ్రీవారి క్షేత్రంలో అన్నమయ్య 520 వ వర్ధంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక నారాయణగిరి ఉద్యానవనంలో నిర్వహించిన ఈ వేడుకలకు అహోబిల 46వ పీఠాధిపతి శ్రీమాన్ శ్రీవణ్ శఠగోప రంగానాధ యతీంద్ర మహాదేసికన్ స్వామిజీ పాల్గొన్నారు. వేడుకలలో భాగంగా శ్రీవారికి ఉంజల్ సేవ నిర్వహించారు. వేడుకలలో భాగంగా టీటీడీ ఆస్థాన విద్వాంసులు, అన్నమాచర్య ప్రాజెక్టు కళాకారులూ, ఎస్వీ మ్యూజిక్ కాలేజీ విద్యార్థులు కలసి ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు, సప్తగిరి సంకీర్తనలు గోష్టిగానం విశేషంగా ఆకట్టుకున్నాయి.
అన్నమయ్య సాహిత్యాన్ని భక్తలోకానికి అందించేందుకు సంకీర్తనల అర్థాలతో అన్నమయ్య సంకీర్తనల హరి అనే పుస్తకం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు సుమారు 4 వేల సంకీర్తనల రికార్డింగ్ జరిగింది. గతేడాది 300 సంకీర్తనలను రికార్డు చేయగా, ఈ సంవత్సరంలో 340 సంకీర్తనలు రికార్డు చేయాలని టీటీడీ సంకల్పించింది.